ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి అయితే అమరావతి బిల్ - 2026 ఆమోదం ఒక ప్రత్యేకమైన మైలురాయి, ఈ బిల్లు ద్వారా అమరావతిని అధికారికంగా రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తించడం జరిగింది. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు ఇది ఒక దశాబ్ద కాలంగా కొనసాగిన అనిశ్చితికి, ఉత్కంఠమైన వాతావరణానికి మరియు దశాబ్ద కాలంగా సాగిన ఉద్యమాలకు ముగింపు పలికింది. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక కొత్త ప్రారంభంగా నిపుణులు చెప్పుకుంటున్నారు.

              ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లోనే సెక్షన్ 5(2) సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్  1 ఏప్రిల్ 2026 బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పై సుమారు రెండు గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాని ఓటుతో ఆమోదించారు, అనంతరం గురువారం 2 ఏప్రిల్ 2026 రోజున ఈ అమరావతి బిల్ - 2026 రాజ్యసభలో సుమారు రెండున్నర గంటల చర్చల (149 నిమిషాల) అనంతరం ముజువాని ఓటుతో పెద్దల సభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. 

 

Amaravati bill 2026

 

                  2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించిన తరువాత అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాలను పరిశీలించి గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది, అదే అమరావతి. అమరావతిని నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 2014 రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీ సి ఆర్ డి ఏ చట్టం ద్వారా ప్రకటించింది. రాజధాని అభివృద్ధి కోసం రాజధాని పరిధిలోని రైతుల దగ్గర నుంచి సుమారు ౩౩ వేల ఎకరాల భూమిని అభివృద్ధి పనుల కోసం స్వచ్ఛందంగా సేకరించి అవసరమైన భవన నిర్మాణాలను చేపట్టారు .

                  2019 తరువాత రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అమరావతి రాజధాని రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉన్న స్థానం లో క్రొత్తగా మూడు రాజధానులు ఉండాలని మూడు భాగాలుగా విభజించి రాష్ట్రంలో 3 వేరు వేరు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా అభివృద్ధి పరచాలని మూడు రాజధానులను ప్రతిపాదించారు.   

         1. విశాఖపట్నం - ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ 
         2 .కర్నూలు - జ్యూడిషియల్ క్యాపిటల్ 
         3 .అమరావతి - లెజిస్లేటివ్ క్యాపిటల్. 

                 ఈ మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు నిరసనలు ప్రారంభించారు అది ఒక వివాదంగా మారింది అమరావతి రైతులు నిరసనలు ప్రారంభించారు 1000 రోజులకు పైగా నిరసనలు కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగాయి ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది


                కానీ 2024 ఎన్నికల అనంతరం మళ్లీ ప్రభుత్వం మారిన తర్వాత అమరావతినే ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలలొ భాగంగా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 

 

అమరావతి బిల్ 2026 - ఏమిటి ?


ఈ బిల్ ద్వారా అమరావతిని అధికారికంగా ఏకైక రాజధానిగా ప్రకటించారు.
ఈ బిల్ ద్వారా అమరావతికి చట్టపరమైన స్థిరత్వం కల్పించారు ఇకమీదట దీన్ని మార్చాలంటే మళ్ళీ చట్టాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. 
ఈ బిల్ ద్వారా భవిష్యత్తులో రాజధాని మార్పుపై అనిశ్చితిని పూర్తిగా తొలగించారు ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన నిర్ణయం అనుకోవచ్చు. 

అమరావతి బిల్ 2026 మొదటిగా లోక్ సభలో ప్రవేశం పెట్టిందనుకోక ముజువాని ఓటుతో లోక్ సభలో 11 పార్టీల సుదీర్ఘ చర్చలు సుమారుగా 11 నిమిషాల పాటు జరిగిన చర్చలు అనంతరం లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. తరువాత రాజ్యసభలో 149 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం 11 పార్టీలో మధ్య జరిగిన చర్చల తర్వాత మూజువాని ఓటుతో రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. 

అమరావతి బిల్ 2026 ఆర్థిక పరంగా భారీ మార్పులను తీసుకురావచ్చని అనుభవజ్ఞులు అంచనా పడుతున్నారు అమరావతి బిల్ 2026 ఆమోదం ఆర్థిక అంశాల పై పెద్ద ప్రభావం చూపుతుందని నిసంశయంగా చెబుతున్నారు. ఇది ఆమోదం పొందడం వలన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెరుగుతాయి దేశీయ మరియు విదేశీ పెట్టుబడులు చాలా వరకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది తద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు 
అమరావతిలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగవచ్చు ఐటీ కంపెనీలు కూడా కొత్తవి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించవచ్చు మరియు నిర్మాణరంగంలో అవకాశాలు పెరుగుతాయి స్టాప్ టాప్ ఎకో సిస్టం కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు మరియు రోడ్డు మెట్రో ప్రాజెక్టులు విద్యాసంస్థలు ఆసుపత్రిలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ఇకమీదట వేగం పుంజుకోనున్నాయి మరియు అనతి కాలంలోనే అమరావతి ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

అమరావతి అభివృద్ధి ప్రణాళిక 
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చూస్తుంది అందులో ముఖ్యమైనవి అసెంబ్లీ భవనం రాష్ట్ర సచివాలయం హైకోర్టు రోడ్లు మరియు బ్రిడ్జిలు వీటిని పూర్తి చేస్తూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించడంలో ప్రణాళికలు రచిస్తుంది 

విమర్శలు మరియు సవాళ్లు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ప్రధాని సవాళ్లు భారీ ఖర్చు లక్షల కోట్ల రూపాయలు మూల పెట్టుబడిగా అవసరం మరియు ఆర్థికంగా ఇంతటి భారీ ఖర్చు రాష్ట్రానికి భారం అవుతుందని కొంతమంది నిపుణులు ఈ ప్రాజెక్టు మీద అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

అమరావతి బిల్ 2026 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది కేవలం రాజధాని నిర్ణయం కోసం మాత్రమే కాదు ఇది ప్రజలను మరియు రాజధాని రైతులు చేసిన త్యాగానికి మరియు రాష్ట్ర అభివృద్ధికి కలయికగా ప్రవేశపెట్టిన బిల్లు ఇది ఇప్పుడు ఆమోదం పొంది వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు ఇప్పుడు ఈ నిర్ణయం విజయవంతం కావడం పూర్తిగా అమలు మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం సరైన ప్రాణాలతో ముందుకు సాగితే అమరావతి దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా మారే అవకాశం ఉంది. 

 

FAQs (SEO Boost కోసం)

1. అమరావతి బిల్ ఏమిటి?

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించే చట్టం.

2. అమరావతి ఎక్కడ ఉంది?

గుంటూరు మరియు విజయవాడ మధ్య ప్రాంతంలో ఉంది.

3. రైతులు ఎందుకు నిరసనలు చేశారు?

మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా.

4. ఈ బిల్ వల్ల లాభం ఏమిటి?

పెట్టుబడులు, అభివృద్ధి, ఉద్యోగాలు పెరుగుతాయి.

 

అమరావతి బిల్ 2026 పై ప్రముఖ వ్యక్తుల స్పందన

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపుని ఇచ్చే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం యావత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఈ చారిత్రక సందర్భంలో ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడాన్ని రైతుల విజియంగా భావిస్తున్న ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ఒక కాలపరిమితితో కూడిన రోడ్ మ్యాప్ కరారు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు 

అమరావతిలో రాజధాని నిర్మాణానికి మేము పూర్తిగా సమర్థిస్తాను దీనిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వర్గాల ప్రజల్లో సాంకూర వైఖరి ఉంది అమరావతి గొప్పతత్విక భూమి బౌద్ధం శైవం వైష్ణవం అలరారుణ తపోభూమి అక్కడ ఏర్పాటు చేస్తున్న రాజధాని అందరూ సమర్థించాలి అన్ని రకాల వర్గాలు వారు ఉన్న ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు వల్ల భూముల ధరలు పెరిగి వారు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది దీన్ని అందరూ మద్దతు ఇవ్వాలని భాజపా ఎంపీ ఆర్ కృష్ణయ్య తన అభిప్రాయాన్ని వ్యక్త చేశారు.